Wednesday, May 7, 2008
ఆంధ్రమహాభాగవతము
పోతన గారి ఆంధ్రమహాభాగవతము ఆపాత మథురము, నవపల్లవ కోమలము, అతి సుందర కావ్యకన్యక. ఓ మహాకవి అన్నట్లు పంచదారలో అద్దుతూ రచింపబడినది. అంతు చిక్కని లోతైన అగాథాలతో కూడి కూడ ఈ భక్తిరస పాలసముద్రము లో ఈతలాడటం అతి సులభం. ఈ తేనెలూరు తేట తెలుగు రచన, బోసినోటితో హాయిగా నవ్వే బుజ్జి పాపాయిలా ఆబాలగోపాలానికి ఆనందప్రదాయినే కాదు, అత్యంత పవిత్రమైన కాశీలో మరణంలా ముక్తిప్రదాయిని కూడా. అలాంటి మహత్తర కావ్యం తీసుకొని ఏమాత్రం చేయాలన్నా నద త్యంత సాహసమే. ఐనా ప్రపంచాగ్నికి సమిధ నొక్కటౌదామని సాహసం చేస్తున్నా.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
సాంబశివరావు గారు, మీరు మహానుభావులు.
ఏమి చెప్పను, ఎలా చెప్పను అంటూ చాల విలువైన సమాచరము ఈ జాతికి అందించారు.
మురళీ కృష్ణ,
www.potanabhagawatam.blogspot.com
Please provide mail-Id or phone number.
Post a Comment